Skip to main content

Posts

Showing posts from 2011

బాలసారె పిలుపు

మా అమ్మ, నాన్నలకు ప్రియమైన ఓ హితజనులారా... నిన్న కాక మొన్ననే కళ్ళు తెరిచాను అమ్మ కమ్మనైన ప్రేమ సాక్షిగా నాన్న గుండెలోన కొండంత ఆశగా నాన్నమ్మ, తాతయ్యల ముద్దులు మూటగా అమ్మమ్మ, తాతయ్యల మురిపాల పాటగా ఈ ఆకుపచ్చ లోకం లో ముక్కు పచ్చలారని పసిగుడ్డుగా పుట్టాను తెలిసినవారు తెలియనివారు అక్కలు, అన్నయ్యలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు పెదనాన్నలు, చిన్నాన్నలు అత్తలు, మావయ్యలు అందరూ ప్రేమగా నన్ను నిమురుతుంటే ఎంత బాగుందో చెప్పలేను... అయితే ఒకటి...నన్ను ఎవరూ పేరు పెట్టి పిలవడం లేదు బాబూ...బాబూ అనే పిలుస్తున్నారు నాకు ఇంకా పేరు పెట్టలేదని అందరూ అనుకుంటున్నారు... అందుకోసమే......తేదీన........వేదికగా బాలసారె చేసి నన్ను ఉయ్యాల జంపాల ఆడిస్తారట... నాకో అందమైన పేరు కూడా పెడతారట...  అదో పేద్ద వేడుకలా చెయ్యాలని అనుకుంటున్నారు మరి ఆ వేడుకకు మీ అందరూ వస్తేనే కదా నాకు జోల పాడేది...పేరు పెట్టేది... మరి మీరంతా రావడం మర్చిపోకండేం... మీరు రాక పోతే నేను ఒప్పుకోనంతే... ఇట్లు మీ ప్రియమైన... ప్రస్తుతానికి పేరు లేని నేను... 

సమైక్యతకు ప్రాణమా

పొడుస్తున్న పొద్దు మీద విడుస్తున్న ఉదయమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... నడుస్తున్న నావ మీద విసుర్తున్న కెరటమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... విరుస్తున్న నింగి మీద ముసురుకున్న మేఘమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... విచ్చుకున్న ఆమని పై విరిగిపడ్డ శిశిరమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... ఆకుపచ్చ కోనలోన చిచ్చుమిసిన జ్వలనమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... గుట్టు నడక దారిలోన గుచ్చుకున్న శూలమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... విరబూసిన పెదవిపైన విరజిమ్మిన రక్తమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... కదులుతున్న కడలిపైన కరిగిన సుడిగుండమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...  రాజకీయ రాట్నమందు దారమైన భారమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... ఓట్ల కొరకు పాట్లు పడే నేతల ఫలహారమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా... కుళ్ళు పెత్తనాల పైన గుల్లయైన దేహమా ఓ తెలంగాణమా.. ఓ తెలంగాణమా...సమైక్యతకు ప్రాణమా...

రైతు బతుకు

"రైతు బతుకు బాటలో మెతుకు వెతుకులాటలో కష్టాలే పెట్టుబడి కన్నీళ్ళే దిగుబడి రుతుపవనాలు వచ్చాయి కాలవలో నీళ్ళు రైతు గుండెలో పరవళ్ళు అల్ప పీడనం వాయుగుండం చేలలోనూ రైతు కళ్ళలోనూ నీళ్ళే నీళ్ళు

గురు మహా శివరాత్రి

విద్య నేర్పు ఒజ్జలెల్ల మహాదేవులే అక్షరాల భిక్షనొసగు ఆదిభిక్షులే అజ్ఞానం అంతు తేల్చు మహారుద్రులే అరమరికలు లేనియట్టి భోళాశంకరులే ఎందరో గురు మహాశివులు ... అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు

చిట్టి రాతలు

పుస్తకం నిండా  జ్ఞాపకాల మేఘాలే పుస్తకం మూసేస్తే కళ్ళ నిండా వర్షాలే రాముడు రావణుడు ఎవరు అయినా ఒకటే సీత కళ్ళల్లో కన్నీరే ఆల్మట్టికి రెండు వైపులా నీరే ఓ వైపు కన్నీరు మరో వైపు పన్నీరు కాలుతోంది తెలుగు పూల తోట తమిళ కర్నాట కన్నుల పంటగా

ఒంటరి

గువ్వకు రెక్కలు వచ్చాయి ఒంటరయ్యింది గూడు బిడ్డకు రెక్కలు వచ్చాయి ఒంటరయ్యింది గుండె

బండబారిన టాంకుబండ్

మహాబోధి సాక్షిగా హుస్సేన్ సాగర్ సాక్షిగా మహనీయులు నేలకొరిగారు మూర్తులను నేలరాల్చి మూర్ఖులు అలసిపోయారు ఇది చూసి తెలుగునేల గుండెలు అవిసి పోయాయి  అన్నిటికీ   మూగసాక్షిగా మిగిలిన టాంక్ బండ్  గుండె బండబారిపోయి   గాయాలు తడుముకొంటూ నిల్చిపోయింది 

చిన్ని రాతలు

''అణు"వణువూ విలయమే సందేశం జపాన్ తీరమే నీతి లేని రాతలు నీటి  మీది గీతలు ముద్దుకూ ముద్దకూ చుట్టుకొలత విశాల విశ్వమంత

ఆకుపచ్చ జ్ఞాపకం

ఇదేమిటీ చైత్రం చేసే చిత్రం ప్రకృతమ్మ ఇంతగా ఎలా మారిపోతుందో... మావికొమ్మ కమ్మగా పూల నవ్వు విసురుతుంది వేప చిగురు మయూరమై విరి నాట్యం చేస్తుంది... కోయిలమ్మ తియ్యగా గొంతెత్తి పా డుతుంది... తెలుగు వాకిలి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తనువంతా ఆనందం నింపుకొని ఎందుకిలా ఎదురుచూస్తోంది    ఎందుకంటే... మావిచిగురు వేపపూత నేస్తం కట్టి కొత్త రుచిని కల్పించే కమనీయ కావ్యం ఇది కొత్త బెల్లం కొత్త చింతపందు చింతలు తీర్చే అరుదైన తరుణమిది పొగరైన వగరుతో ఉప్పైన  కడలితో ఉప్పొంగే సంతోషం ఇది ప్రకృతమ్మ పచ్చగా నులివెచ్చగా హృదయాలను తాకే    ఆకుపచ్చ  జ్ఞాపకం ఇది... ఇది ఉషస్సులను యశస్సులను నిర్మించే పునాది తెలుగువారి తలపుల్లో ఆనందపు నెలవది యుగానికే ఆదిగా సంతోషపు వారధిగా పలకరించు ఉగాది... అందుకే ప్రకృతమ్మ మోములో నురగలెత్తు  తరగలెత్తు పరవశాల జల నిధి...

కూలిన "వెలుగు"

తొలిపొద్దు రెక్కలువిప్పే ఊహాలోకం... తెలుగు వెలుగుల కోసం వెలుగుల తెలుగు జాతి కోసం మీరు మీ జీవితాలనే ధార పోశారు మేము  మాత్రం మిమ్మల్ని రోడ్డుకు లాగాం ఉద్వేగాలతో మీ మహత్తుని విస్మరించి మీకు ప్రాంతీయ రంగుల్ని పులిమి కసితీరా మిమ్మల్ని కూలగొట్టాం హుస్సెన్ సాగర్ లో నిమజ్జనం చేశాం మా వికృత దాహాన్ని తీర్చుకున్నాం తెలుగు జాతి గౌరవాన్ని రౌరవాది నరకాల్లోకి విసిరేసాం ఎవరు గాయపడినా మాకు లెక్క లేదు మా ఉద్వేగాలు చల్లారితే...  మా ఉద్దేశాలు నెరవేరితే మాకు చాలు...

'మహి' మాన్విత మూర్తులు

జన్మనిచ్చిన ఆమ్మకు పురుడు పోసిన నరుసమ్మకు కాపిన ముసలమ్మకు ఎత్తుకొని బుజ్జగించిన ఆయమ్మకు బాలసారె చేసిన అమ్మమ్మకు తొలి అన్నం ముద్ద పెట్టిన నాయనమ్మకు జీవితాన్ని దిద్దిన గురువమ్మకు తొలి గిలిగింతలు పెట్టిన గృహిణమ్మకు  ఇలా బతుకు పొడవునా ఎదురైన ఎందరో మహికే పుట్టిన మహిమాన్విత మూర్తులు మహిళలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ...

ఉగాది

చిరునవ్వుల సిరిమువ్వలు వేపపూల సోయగాలు శుభలేఖల శశిరేఖలు లేత మావి తోరణాలు సామవేద సుస్వరాలు కోయిలమ్మ పాటలు వేదాలకు భాష్యాలు పచ్చడిలో ఆరు...

బాపు

బక్క పలుచనయ్య బోసినవ్వు తాతయ్య అహింస ఆయుధమయ్య స్వరాజ్యము తెచ్చెనయ్య వెలుగు కళ్ళ బాపు బానిసత్వము బాపు ప్రుథివి ఉన్నంత సేపు భారతీయుని...

గురు భోగి

 బోధించే గురువులెల్ల భోగిమంటలే  చలి చీకటి తరిమికొట్టు అగ్ని శిఖలే  విజ్ఞానపు వెచ్చదనం పంచే పరమాత్ములే  భో గాలను అంధించే మహాభోజులే