మా అమ్మ, నాన్నలకు ప్రియమైన ఓ హితజనులారా... నిన్న కాక మొన్ననే కళ్ళు తెరిచాను అమ్మ కమ్మనైన ప్రేమ సాక్షిగా నాన్న గుండెలోన కొండంత ఆశగా నాన్నమ్మ, తాతయ్యల ముద్దులు మూటగా అమ్మమ్మ, తాతయ్యల మురిపాల పాటగా ఈ ఆకుపచ్చ లోకం లో ముక్కు పచ్చలారని పసిగుడ్డుగా పుట్టాను తెలిసినవారు తెలియనివారు అక్కలు, అన్నయ్యలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు పెదనాన్నలు, చిన్నాన్నలు అత్తలు, మావయ్యలు అందరూ ప్రేమగా నన్ను నిమురుతుంటే ఎంత బాగుందో చెప్పలేను... అయితే ఒకటి...నన్ను ఎవరూ పేరు పెట్టి పిలవడం లేదు బాబూ...బాబూ అనే పిలుస్తున్నారు నాకు ఇంకా పేరు పెట్టలేదని అందరూ అనుకుంటున్నారు... అందుకోసమే......తేదీన........వేదికగా బాలసారె చేసి నన్ను ఉయ్యాల జంపాల ఆడిస్తారట... నాకో అందమైన పేరు కూడా పెడతారట... అదో పేద్ద వేడుకలా చెయ్యాలని అనుకుంటున్నారు మరి ఆ వేడుకకు మీ అందరూ వస్తేనే కదా నాకు జోల పాడేది...పేరు పెట్టేది... మరి మీరంతా రావడం మర్చిపోకండేం... మీరు రాక పోతే నేను ఒప్పుకోనంతే... ఇట్లు మీ ప్రియమైన... ప్రస్తుతానికి పేరు లేని నేను...