Skip to main content

బాలసారె పిలుపు


మా అమ్మ, నాన్నలకు ప్రియమైన
ఓ హితజనులారా...
నిన్న కాక మొన్ననే కళ్ళు తెరిచాను
అమ్మ కమ్మనైన ప్రేమ సాక్షిగా
నాన్న గుండెలోన కొండంత ఆశగా
నాన్నమ్మ, తాతయ్యల ముద్దులు మూటగా
అమ్మమ్మ, తాతయ్యల మురిపాల పాటగా
ఈ ఆకుపచ్చ లోకం లో
ముక్కు పచ్చలారని పసిగుడ్డుగా పుట్టాను
తెలిసినవారు తెలియనివారు
అక్కలు, అన్నయ్యలు,
పెద్దమ్మలు, పిన్నమ్మలు
పెదనాన్నలు, చిన్నాన్నలు
అత్తలు, మావయ్యలు
అందరూ ప్రేమగా నన్ను నిమురుతుంటే
ఎంత బాగుందో చెప్పలేను...
అయితే ఒకటి...నన్ను ఎవరూ పేరు పెట్టి పిలవడం లేదు
బాబూ...బాబూ అనే పిలుస్తున్నారు
నాకు ఇంకా పేరు పెట్టలేదని అందరూ అనుకుంటున్నారు...
అందుకోసమే......తేదీన........వేదికగా
బాలసారె చేసి నన్ను ఉయ్యాల జంపాల ఆడిస్తారట...
నాకో అందమైన పేరు కూడా పెడతారట... 
అదో పేద్ద వేడుకలా చెయ్యాలని అనుకుంటున్నారు
మరి ఆ వేడుకకు మీ అందరూ వస్తేనే కదా
నాకు జోల పాడేది...పేరు పెట్టేది...
మరి మీరంతా రావడం మర్చిపోకండేం...
మీరు రాక పోతే నేను ఒప్పుకోనంతే...
ఇట్లు
మీ ప్రియమైన... ప్రస్తుతానికి పేరు లేని నేను... 

Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా