Skip to main content

పరిణామం

ఇప్పుడు మేలుకొలుపు పాటను
సెల్ ఫోన్ పాడుతోంది
కొమ్మల్లో కోయిలమ్మ
గొంతు చించుకుంటొంది

టీవీ నాయనమ్మ
తన ఎలక్త్రానిక్ గొంతుతో
కార్టూన్ కథలు
జేంస్ బాండు చరిత్రలు వినిపిస్తోంది

ఊరునూ వాడను
క్రికెట్ వర్షం తడిపేస్తోంది
కబాడీ బిళ్ళంగోడి
కాగితం పడవలయ్యాయి

రేడియేషన్ మింగేసి
పిచ్చుకమ్మ నిద్దరోతోంది
ఈ జన్మకు లేవలేనంతగా


కాలం వాయువేగంతో కదలి పోతోంది
సంస్కృతి పాతాళానికి జారిపోతోంది

ఇది కాల పరిణామం
అంగీకరించాలో
తిరస్కరించాలో తెలియని
తీవ్ర అయోమయం

Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా