Skip to main content

ఎక్కడ ఉగాదులు

తేట తెలుగు పలికినందుకు
ఒంటిపై వాతలు తేలుతున్నాయి
అమ్మ,  నాన్న అని పిలుస్తుంటే
అవమానాలు మొదలయ్యాయి
భాషకు ప్రాణమైన మహా ప్రాణాలు పలకడానికి
ప్రాణాలు పోతున్నాయి
ఒత్తులు పలకలేక
జీవన వత్తులు వెల వెలబోతున్నాయి
దీర్ఘాలు చెప్పలేక
గుణింతాలు పలకలేక
తెలుగు కంటే
పరభాష సుఖమని
పరవశించి పోతుంటే 
ప్రభుత్వాలు కూడా
అమ్మ భాషను కాపాడలేక చేతులు ఎత్తేస్తుంటే
ఉగాది శుభ కామనలు కూడా
స్వభాషలో తెలుపలేకపోతుంటే
తెలుగు దినాన్ని కూడా
ఆంగ్లవత్సరంలా జరుపుతుంటే
ఇక మన తెలుగు జాతికి
ఉగాదులు ఎక్కడ
ఉషస్సులు ఎక్కడ..? 

Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా