Skip to main content

వంద వందల వందనం



                                                    

గుండెల్లో అశోకచక్రాన్ని నింపుకొని
కాళ్ళకు చక్రాలు తొడుక్కొని
అతను పరుగులు తీస్తుంటే
కళ్ళల్లో జాతీయ పతాకాన్నిఅద్దుకొని

వంద కోట్ల ఆశలు ఆవహించి
అతను విజయం వైపు
గర్వంగా నడుస్తుంటే
చేతిలో చెక్కముక్కను
ఉక్కుముక్కలా మార్చి
బంతిని పూలచెండులా మలిచి
అతను ఆటను ఆడే తీరుకు


మువ్వన్నెల పతాకం కూడా
ముచ్చటపడి రెక్కలు కట్టుకొంటూ
జాతి ఖ్యాతిని మోసుకొంటూ
నింగికి ఎగిరిపోతుంది
ఆటను ఆటగా కాకుండా
తపస్సులా ఆతను భావిస్తాడు
ప్రతి పరుగును జాతికి అంకితమిస్తాడు
సచివుడిగా సచినుడిగా
మైదానంలో సింహంలా
మాటలో మృదువుగా
వ్యక్తిత్వంలో ఎవరేష్ట్ లా  ఎదిగి
ఎదిగిన కొద్ది ఒదిగిన
సమున్నత ముర్తిమత్వపు
సగర్వ రేఖాచిత్రం సచిన్

ఒకటో వంద నుంచి
వంద వందల వరకు చేసిన ప్రయాణంలో
ఒక్క రోజు కూడా అలిసిపోని
ఆగిపోని ఆనంద  ప్రవాహం
అందుకే ఆ పరుగుల వీరుడికి
భారత జాతి ముద్దు బిద్దడికి
                             చేస్తున్నా వంద వందల వందనం
   




 
     .



Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా