Skip to main content

మోసపు పోటు


 
ముప్పై ఏళ్లుగా
చీకటి నింపుకున్న జీవితం 
వెలుగు కోసం ఆశగా
ఎదురు చూపులు చూస్తున్న ప్రాణం
మీరు ముందురోజు విడుదల అంటే
సరబ్జీత్ కుటుమ్బమే కాదు
యావద్భారతమే ఆకాశమంత  ఉప్పొంగిపోయింది
కళ్ళల్లో వత్తులు వేసుకుంది
మేళ తాళాలు స్వాగతానికి సిద్ధం చేసుకుంది
మూడు దశాబ్దాలుగా కొడుకు కోసం
ఎదురు చేస్తున్న తల్లి మురిసిపోయింది 
ఆ మర్నాడే తూచ్
పేరు తప్పు అని ప్రకటించిన
మీ మానవత్వానికీ 
మీరు చూపిన విజ్ఞతకు కుంగిపోయింది ...
అదిగో ఇదిగో అని చెప్పడానికి
ఇది దొంగాట కాదు
ఏమో ఏమో అని చెప్పడానికి
ఇది సందేహం కాదు
ఓ సారి విడుదల అని చెప్పి
మరోసారి సారీ అని చెప్పడానికి
ఇది ఆట్లాట కాదు
బతుకుతో పోరాడుతున్న
ఓ భారతీయుడి వేదన
నలిగిపోతున్న గుండెలపై
మీరు దింపిన మరో మోసపు పోటు
శత్రువులా మారిన
దాయాది నేస్తమా
నీకిదే మా విన్నపం
నువ్వు  నవ్వించక పోయినా పర్వాలేదు
మమ్మల్ని ఏడిపించక పొతే చాలు 
నువ్వు మాకు స్నేహహస్తం
చాచక పోయినా పర్వాలేదు
సమ్మెట పోటు పొడవక పొతే చాలు 






 

Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా