Skip to main content

పచ్చల పతకం


అక్షరాల సుమాలను
పదాల పాదాలతో
వాక్యాల  పధాలపై
పరిగెత్తే కెరటం
ప్రసరించే కిరణం

అంకెల లంకెలలో
 కూడికలై తీసివేతలై
గుణకారమై   భాగాహారమై
నాదమై వాదమై
సంఖ్యా సిద్ధాంతమై
 అగణితమై గణితమై
విరజిమ్మే పవనం
విరాజిల్లే చైతన్యం

 విత్తుగా  మొలకెత్తి
వృక్షమై విస్తరించి
విద్వత్తును విద్యుత్తుగా  మలిచి
విశ్వాన్తరాళా లను  వలిచే
విజ్ఞాన తరంగం
సుజ్ఞాన విహంగం

గురువంటే మానవత 
గురువంటే సమత
గురువంటే శక్తి
గురువంటే స్ఫూర్తి
గురువంటే రాజ్యాంగం
గురువంటే జాతీయగీతం
గురువంటే ఎగరేసే  విజయపతాకం
గురువంటే ధరణి సిగలో పచ్చల  పతకం ....

Comments

  1. చాలా బాగా చెప్పారు గురువు యొక్క ఔనత్యాన్ని.
    Wish You Happy teachers day.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా