Skip to main content

అమ్మకు జేజేలు



అమ్మా ఎలా కన్నావు నన్ను
నన్ను నన్నుగా ఎలా చూపించావు
నిన్ను నిన్నుగా చూడలేక
నేను నేనుగా బతకలేక
వేగిపోతున్న నన్ను ఎలా కన్నావు
ఈ భూమిమీద నేను పడ్డప్పుడు
నేను ఇలా ఉండాలని అనుకున్నావా
అసలు నేను మనిషినేనా
పాలు తాగి రోమ్ముగుద్దే
నన్ను ఎలా కన్నావు
తిన్న అన్నం ముద్దల్లో కూడా
విశ్వాసం  కురిపించలేని
నన్ను ఎలా కన్నావు 
పట్టుకొని నడిచే వేలుని విరిచే
నన్ను ఎలా పెంచావు
నడవలేని నిన్ను
నీ మానాన వదిలేసే
నన్ను ఎలా కన్నావు
ఎలా పెంచావు
ఈ నేలను ప్రేమించక
నీతిగా నడవక
నలుగురిలో నవ్వుల పాలయ్యే
నన్ను ఎలా కన్నావు
ఒక లక్ష్యం లేక
ఒక సాధన లేక
దేశం పై పడి పెచ్చరిల్లే పెల్లగిల్లే
ఈ అతివాదిని ఎలా కన్నావు
ఎలా  భరిస్తున్నావు
అందుకే అమ్మ  ధరణీ
నీ ప్రేమకు నీ ఓర్పునకు
వేన  వేల జేజేలు 


Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా