Skip to main content

పడమట రాలిన పుష్పం

వేల మైళ్ల అవతల
పడమటి వీధిలో
ఇక్కడ సూర్యుడు అస్తమించాక
అమెరికా లో అమావాస్య కమ్మేసింది
అమానుషంగా పెచ్చరిల్లిన ఓ మానవ మౄగం
అభం శుభం తెలీని పసిపువ్వును చిదిమేసింది
పసిపాప కనుపాపలో
కమ్మని కలలను కాటేసింది
పాలకోసం పారడే పాపను
అయ్యో పాపం అనుకునేలా అంతం చేసింది
చిట్టి చేతుల చిన్నారి తల్లిని
చేజేతులా నలిపేసింది
పొత్తిళ్లు దాటని పసిగుడ్డును
నెత్తుటి మూటగ మార్చడానికి
ఆ మౄగానికి మనసెలా వచ్చిందో...
ఇదే ఆవేదన అందరిలో
కారణం ఏదైనా కావొచ్చు...కానీ 
ఇది దారుణం అంటు జనత గుండె ఘొషించింది
మనిషి మాయమవుతున్నడని
మానవత్వం కనుమరుగవుతుందన్న
చేదునిజాల సాక్షిగా
తనలాంటి పసిపువ్వుల చిరునవ్వులు
కాపాడమంటు..వేడుకొంటూ
చిన్నారి శాన్వీ
నింగికెగసింది...
కన్నీళ్ళతో పాటూ
సమాధానాలు తేలని
ప్రశ్నలను కూడా మిగులుస్తూ...
(అమెరికాలో చిన్నారి శాన్వీ హత్యకు వేదనగా)

Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా