Skip to main content

అమ్మ నేల


దేశ మాత  సిగలో
అనగనగా ఓ ముత్యం
అన్న పూర్ణగా సుప్రసిద్ధం

చిరునవ్వుల సిరిమువ్వలు
విరిజల్లులై రాలిన స్వర్గం
గోదావరి కృష్ణమ్మ
పెన్నమ్మ వంశ ధారలు
పారాడే పవిత్ర స్థలం
తెలంగాణ రాయలసీమ
కోస్తా ఉత్తరాంధ్ర
అంగాలై అలరారిన పవిత్ర దేహం
నన్నయాది కవులకు
పోరాట వీరులకు
సంఘసంస్కర్తలకు
స్వాతంత్ర్య యోధులకు
సంస్కృతీ సౌరభాలకు
నిలయమైన దేవాలయం
పేరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
తీరు దేశానికే ఆదర్శం



ఏ వేర్పాటు  దెయ్యం పూనిందో
ఏ  విభజన  అమావాస్య కమ్మిందో
ఏ రాజకీయ  రక్కసి  కాటేసిందో
ఏ  ద్రోహానికిబలి అయ్యిందో
అమ్మనేల వీడిపోతోంది
ముక్కలు చెక్కలైపోతోంది
తెలుగు నేలంతా
కన్నీళ్ళు కాలువలు కడుతున్నాయి
ఆవేదన అవధులు దాటుతోంది
సగటు తెలుగు గుండె మండుతోంది
అ  నుంచి అం  అః
క నుంచి బండీరా
అక్షరాల సాక్షిగా
కోట్లాది గుండెలన్ని
ఒక్కటంటు నమ్మిన హృదయం
వేరుపాటుపేల్చిన పేలుడికి
ఉలికులికి పడుతోంది
అన్నం సహించడం మానేసింది
ఆకలి నిద్ర దూరమయ్యింది

ఎవరు రాస్తున్నారీ తెలుగు వాడి తలరాత
ఎవరు చేస్తున్నారీ విధ్వంసపు కోత
ఎవరు చేసిన పాపం ఇది
ఏ విధాత విసిరిన శాపం ఇది
ఎందుకు నా కన్నతల్లికి ఈ కష్టం
ఎందుకు నా జన్మభూమికి ఈ నష్టం
సమాధానాలు లేని ప్రశ్నలే ఇవి
జవాబులు రావాల్సింది నేతల గుండెల్లోంచే
రుజువులు తేలాల్సింది చేదు నిజాల చీకట్లలోంచే








Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా