Skip to main content

విభజన వాయిదా

మునగాల మనదే
మణుగూరు మనదే
భద్రాద్రి మనదే
వెంకటాద్రి మనదే
తెలంగాణ మనదే
రాయలసీమ మనదే
కోస్తాంధ్ర మనదే
మొత్తంగా సమైక్యాంధ్ర మనదే
అడ్డే వాడెవ్వడు
అడ్డు చెప్పేవాడెవ్వడు
కాదన్న వాడెవ్వడు
సమైక్యతను వద్దన్నవాడెవ్వడు
ఎందుకీ శుష్క  వాదనలు
ఎందుకీ అనవసర వివాదాలు
బహిష్కరిద్దాం వేర్పాటు వాదులను
ఒక్కటి చేద్దాం సమైక్య వీరులను
వాయిదా వేద్దాం విభజనను
ఓ జీవితకాలం..
కలసే ఉందాం
కలకాలం


Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా