Skip to main content

నాగావళి

నేను పుట్టక ముందే
తాను తరగలెత్తింది
నేను పెరగక ముందే
తాను నురగలెత్తింది
నాలో ఆనందాల తెర చాపలెత్తి
నన్ను పడవను చేసి ఆడించింది
నాలో సంతోషం ఉరకలేస్తే
తాను జల జలా పారింది నాగావళి
నాలో విషాదం ఆవరిస్తే
తాను ఇంకిపోయి చెలమలయ్యింది నాగావళి
నా బాల్యంలో జోల పాడి
నా కౌమారంలో ఈలలూది
నా యవ్వనంలో నన్ను ఊగించి,శాసించి, రక్షించి
నా బతుకు బాటలో పాటయ్యింది నాగావళి
నా విజయంలో తుళ్ళింతగా చేరి
నా అపజయంలో కన్నీటి చుక్కగా మారి
నన్ను అల్లుకుంది బంధమై పూల తీగలా
తాను కదిలింది నాతో కలసి తేనె వాగులా...

Comments

Popular posts from this blog

పని దొరికింది

ఎలచ్చన్లు వత్తన్నాయి ఊరిలో ఓటరన్నకు  పని దొరికింది అదే... ఐదేళ్లకోసారి వచ్చే పని జెండాలు ఊపే పని చప్పట్లు కొట్టే  పని ఈలలు వేసే పని కేకలు వేసే పని ఉదయం ఒకరికి జై ఆనే పని సాయంత్రం ఇంకొకరికి సై అనే పని అర్ధం పర్ధం లేని ఊకదంపుడు ఉపన్యాసాలు  వినేపని... ఆ పని కోసం... ఎండలో ఎండిపోతాడు  అచ్చం వాడి కడుపులానే ... వానలో తడిసిపోతాడు కాకపోతే వాగ్దానాల వానలో.. నువ్వు కూడా నా వెంట రావాల్రా .. అని నాయకుడనే సరికి తనే ఒక పెద్ద నాయకుడిలా మారిపోతాడు ఎదురు పడి ఓ దండం పెట్టేసరికి వరమిచ్చే  దేవుడిలా మారిపోతాడు అరిచి అరిచి  అలసి సొలసి సాయంత్రం గూటికి చేరిపోతాడు జేబులో కాసిన్ని డబ్బులతో కడుపులో కాసిన్ని మందు నీళ్ళతో భలే పని దొరికిందని ఇలాగే బాగుందని మురిసిపోతాడు ముప్పేట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మానేసి ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యల్ని గాలి కొదిలేసి ... రాత్రి నిద్దరోతాడు తెల్లారేసరికి ఏ జండా పట్టుకోవాలా ఆలోచిస్తూ...     ఆ రోజుకు రెక్కలు ఆడాయి కనుక రేపటి రోజుల్లో బతుకు మెతుకుల మాట గతుకు గతుకుల బాటను మర్చిపోతాడు ఈలోగా నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయిపోతా